Skip to content
2 రాజులు 7:10-16

2 రాజులు 7:10-16

10
కాబట్టి వారు వెళ్లి పట్టణ ద్వారపాలకులను పిలిచి, “మేము అరామీయుల శిబిరానికి వెళ్లాము. అక్కడ ఎవరూ లేరు, మనిషి చప్పుడు కూడా లేదు, గుర్రాలు, గాడిదలు, గుడారాలు ఉన్నవి ఉన్నట్లే ఉన్నాయి” అని చెప్పారు.
11
ఆ ద్వారపాలకులు, ఆ వార్త బిగ్గరగా కేకలువేస్తూ రాజభవనంలో ఉన్నవారికి తెలియజేశారు.
12
రాజు రాత్రివేళ లేచి తన అధికారులతో, “మనకు వ్యతిరేకంగా అరామీయులు చేసేది చెప్తాను వినండి, మనం ఆకలితో అలమటిస్తున్నామని వారికి తెలుసు; కాబట్టి ‘వారు ఖచ్చితంగా బయటకు వస్తారు, అప్పుడు వారిని ప్రాణాలతో పట్టుకుని, నగరంలో చొరబడదాం’ అని అనుకుని వారు శిబిరం విడిచిపెట్టి వెళ్లి పొలాల్లో దాక్కున్నారు” అని చెప్పాడు.
13
అతని అధికారులలో ఒకడు, “పట్టణంలో మిగిలిన అయిదు గుర్రాలను తీసుకుని కొంతమందిని అక్కడికి వెళ్లనివ్వండి, వారి పరిస్థితి, మిగిలిన ఇశ్రాయేలీయులందరి పరిస్థితి ఒక్కటే, అందరం చనిపోతాము. కాబట్టి ఏమి జరిగిందో తెలుసుకోవడానికి వారిని పంపుదాం” అని అన్నాడు.
14
కాబట్టి వారు రెండు రథాలను, వాటి గుర్రాలను తీసుకున్నారు. రాజు వారిని అరాము సైన్యం వెనుక పంపుతూ, “మీరు వెళ్లి ఏమి జరిగిందో తెలుసుకోండి” అని వారిని ఆదేశించాడు.
15
వారు అరాము సైన్యం వెంట యొర్దాను వరకు వెళ్లారు, దారి పొడవున అరామీయులు పారిపోయే తొందరలో బట్టలు సామాన్లు పారవేసి వెళ్లారు. కాబట్టి రాజు పంపిన దూతలు తిరిగివచ్చి ఆ విషయం రాజుకు తెలిపారు.
16
అప్పుడు ప్రజలు బయటకు వెళ్లి అరామీయుల శిబిరాన్ని దోచుకున్నారు. యెహోవా చెప్పిన మాట ప్రకారమే, షెకెల్ వెండికి ఒక మానిక సన్నని గోధుమ పిండి, షెకెల్ వెండికి రెండు మానికల యవలు అమ్మబడింది.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options