Skip to content
2 రాజులు 23:1-3

2 రాజులు 23:1-3

1
అప్పుడు రాజు యూదాలో, యెరూషలేములో ఉన్న పెద్దలందరినీ పిలిపించాడు.
2
అతడు యూదా ప్రజలతో, యెరూషలేము వాసులతో, యాజకులతో, ప్రవక్తలతో, అల్పుల నుండి ఘనులైన ప్రజలందరితో కలిసి యెహోవా ఆలయానికి వెళ్లాడు. అక్కడ రాజు, వారంతా వినేటట్టు యెహోవా మందిరంలో దొరికిన నిబంధన గ్రంథంలో ఉన్న మాటలన్నీ చదివి వినిపించాడు.
3
రాజు ఒక స్తంభం దగ్గర నిలబడి, తన పూర్ణహృదయంతో, పూర్ణ ఆత్మతో యెహోవాను అనుసరిస్తానని, ఆయన ఆజ్ఞలు, కట్టడలు, శాసనాలు పాటిస్తానని, యెహోవా సన్నిధిలో నిబంధనను పునరుద్ధరించాడు, తద్వారా ఈ గ్రంథంలో వ్రాయబడిన నిబంధన మాటలన్నీ నిర్ధారించాడు. అప్పుడు ప్రజలందరు ఆ నిబంధనకు సమ్మతించారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options