Skip to content
2 రాజులు 18:17-26

2 రాజులు 18:17-26

17
అష్షూరు రాజు తన ప్రధాన సైన్యాధిపతిని, ముఖ్య అధికారిని, సైన్యాధిపతిని, పెద్ద సైన్యంతో, లాకీషు నుండి యెరూషలేములో ఉన్న రాజైన హిజ్కియా దగ్గరకు పంపాడు. వారు యెరూషలేముకు దండెత్తి చాకలి రేవు దారిలో ఉన్న పై కోనేటి కాలువ దగ్గర ఆగారు.
18
వారు రాజును పిలిపించారు; హిల్కీయా కుమారుడు, రాజభవన నిర్వాహకుడైన ఎల్యాకీము, కార్యదర్శియైన షెబ్నా, ఆసాపు కుమారుడు రాజ్య లేఖికుడైన యోవాహు వారి దగ్గరకు వెళ్లారు.
19
అప్పుడు సైన్యాధిపతి వారితో అన్నాడు, “హిజ్కియాకు చెప్పండి: “ ‘మహారాజు, అష్షూరు రాజు చెప్పే మాట ఇది: దేన్ని చూసుకుని నీకు ఈ ధైర్యం?
20
యుద్ధం విషయంలో నీకు ఆలోచన, బలం ఉంది అంటావు, కాని నీవు మాట్లాడేవి వట్టి మాటలే. నీవు ఎవరిని నమ్ముకొని నామీద తిరుగుబాటు చేస్తున్నావు?
21
చూడు, నీవు నలిగిన రెల్లులాంటి ఈజిప్టును నమ్ముకుంటున్నావు, ఎవరైనా దాని మీద ఆనుకుంటే అది అతని చేతికి గుచ్చుకుని లోపలికి దిగుతుంది. ఈజిప్టు రాజైన ఫరోను నమ్ముకునే వారందరికి అతడు చేసేది అదే.
22
అయితే, “మా దేవుడైన యెహోవా మీద మేము ఆధారపడుతున్నాం” అని మీరు నాతో అంటే, “యెరూషలేములో ఉన్న ఈ బలిపీఠం దగ్గర మీరు ఆరాధించాలి” అని యూదా వారితో యెరూషలేము వారితో చెప్పిన ఆయన ఉన్నత స్థలాలను, బలిపీఠాలనే కదా హిజ్కియా పడగొట్టింది?
23
“ ‘ఇప్పుడు రండి, నా యజమానియైన అష్షూరు రాజుతో బేరం కుదుర్చుకోండి: మీ దగ్గర సరిపడే రౌతులు ఉంటే, నేను మీకు రెండువేల గుర్రాలు ఇస్తాను!
24
రథాలు, రౌతుల కోసం ఈజిప్టు రాజును నమ్ముకున్నా, మీరు నా యజమాని అధికారులలో అతి అల్పుడైన ఒక్క అధికారినైనా ఎలా ఎదిరించగలరు?
25
యెహోవా నుండి మాట రాకుండానే ఈ స్థలంపై దాడి చేసి నాశనం చేయడానికి వచ్చానా? ఈ దేశంపై దాడి చేసి నాశనం చేయమని స్వయాన యెహోవాయే చెప్పారు.’ ”
26
అప్పుడు హిల్కీయా కుమారుడైన ఎల్యాకీము, షెబ్నా, యోవాహు సైన్యాధిపతితో, “నీ దాసులమైన మాకు అరామిక్ భాష అర్థం అవుతుంది కాబట్టి ఆ భాషలో మాట్లాడండి. గోడ మీద ఉన్న ప్రజలకు వినిపించేలా హెబ్రీ భాషలో మాట్లాడకండి” అన్నారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options