1 సమూయేలు 8:4-9
4
కాబట్టి ఇశ్రాయేలీయుల పెద్దలందరు ఒక్కటిగా కలిసి రామాలో ఉన్న సమూయేలు దగ్గరకు వచ్చారు.
5
వారతనితో, “నీవు ముసలివాడవు, నీ కుమారులు నీ మార్గాన్ని అనుసరించుట లేదు; కాబట్టి ఇతర దేశాలకు రాజు ఉన్నట్లే మాకు న్యాయం చేయడానికి ఒక రాజును నియమించు” అని అడిగారు.
6
అయితే వారు, “మమ్మల్ని నడిపించడానికి మాకు ఒక రాజు కావాలి” అని అడగడం సమూయేలుకు నచ్చలేదు; కాబట్టి అతడు యెహోవాకు ప్రార్థన చేశాడు.
7
అందుకు యెహోవా సమూయేలుతో, “ప్రజలు నీతో చెప్పేదంతా విను; వారు తిరస్కరించింది నిన్ను కాదు, వారికి రాజుగా ఉండకుండా నన్ను తిరస్కరించారు.
8
వారు నన్ను విడిచిపెట్టి ఇతర దేవతలను సేవిస్తూ, ఈజిప్టులో నుండి నేను వారిని బయటకు రప్పించిన రోజు నుండి ఇప్పటివరకు అలాగే చేశారు. నీ పట్ల కూడా అలాగే చేస్తున్నారు.
9
వారు చెప్పేది విను; అయితే వారిని పరిపాలించబోయే రాజు హక్కులు ఎలాంటివో వారికి స్పష్టంగా వివరించి హెచ్చరించు” అని చెప్పారు.
Settings