1 సమూయేలు 22:20-23
20
అయితే అహీటూబు కుమారుడైన అహీమెలెకు కుమారులలో అబ్యాతారు అనే ఒకడు తప్పించుకుని పారిపోయి దావీదు దగ్గరకు వచ్చి, సౌలు యెహోవా యాజకులను చంపించిన విషయం దావీదుకు చెప్పాడు.
22
అప్పుడు దావీదు అబ్యాతారుతో, “ఆ రోజు ఎదోమీయుడైన దోయేగు అక్కడే ఉన్నాడు కాబట్టి వాడు సౌలుకు ఖచ్చితంగా ఈ విషయం చెప్తాడని నేను అనుకున్నాను. నీ తండ్రి ఇంటివారందరు చనిపోవడానికి నేను కారణమయ్యాను.
23
నీవు భయపడకుండా నా దగ్గర ఉండు, నిన్ను చంపడానికి చూస్తున్నవాడే నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నాడు. నా దగ్గరే నీవు క్షేమంగా ఉంటావు” అని చెప్పాడు.
Settings