కంటెంట్‌కు వెళ్లండి
1 సమూయేలు 18:10-16

సౌలు హత్యకు ప్రయత్నించుట

1 సమూయేలు 18:10-16
10
తర్వాత రోజు దేవుని దగ్గర నుండి దురాత్మ ఒకటి సౌలు మీదికి బలంగా వచ్చి అతడు ఇంట్లో ప్రవచిస్తున్నప్పుడు దావీదు ఎప్పటిలాగానే వీణ పట్టుకుని వాయించాడు. సౌలు చేతిలో ఒక ఈటె ఉంది.
11
సౌలు, “దీనితో నేను దావీదును గోడకు వ్రేలాడదీస్తాను” అని తనలో తాను అనుకుని దావీదు మీదికి ఈటె విసిరాడు కాని దావీదు రెండు సార్లు తప్పించుకున్నాడు.
12
యెహోవా తనను విడిచిపెట్టి దావీదుకు తోడుగా ఉండడం చూసి సౌలు దావీదుకు భయపడ్డాడు.
13
కాబట్టి సౌలు దావీదును తన దగ్గర నుండి తీసివేసి సహస్రాధిపతిగా నియమించాడు; దావీదు యుద్ధాలలో సైన్యాన్ని ముందుండి నడిపించాడు.
14
యెహోవా దావీదుకు తోడుగా ఉన్నారు కాబట్టి అతడు చేసిన వాటన్నిటిలో విజయాన్ని సాధించాడు.
15
దావీదు సాధిస్తున్న విజయాలను చూసి సౌలు అతనంటే మరింత భయపడ్డాడు.
16
దావీదు యుద్ధాలలో సైన్యాన్ని ముందుండి నడిపించాడు కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు యూదా ప్రజలు అతన్ని ప్రేమించారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options