Skip to content
1 పేతురు 4:7-11

అంత్యకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఆచరణాత్మక కర్తవ్యాలు

1 పేతురు 4:7-11
7
అన్నిటికి అంతం సమీపించింది, కాబట్టి మీరు స్వస్థబుద్ధి కలిగి, మెలకువతో ప్రార్థించండి.
8
అన్నిటికంటే ముఖ్యంగా ఒకరిపట్ల ఒకరు ఎక్కువ ప్రేమగలవారై ఉండండి. ఎందుకంటే ప్రేమ అనేక పాపాలను కప్పివేస్తుంది.
9
సణుగుకోకుండా ఒకరికొకరు ఆతిథ్యమివ్వండి.
10
అనేక రకాలైన దేవుని వరాలకు మంచి నిర్వాహకుల్లా ప్రతి ఒక్కరు దేవుని నుండి తాము పొందిన విశేష కృపావరాలను ఇతరుల మేలుకోసం ఉపయోగించాలి.
11
ఎవరైనా మాట్లాడితే, వారు దేవుని మాటలే మాట్లాడాలి. ఎవరైనా సేవ చేస్తే, దేవుడు ఇచ్చే శక్తితోనే సేవ చేయాలి. అప్పుడు అన్ని విషయాల్లో యేసు క్రీస్తు ద్వారా దేవుడు స్తుతించబడతారు. ఆయనకే మహిమ, ప్రభావం నిరంతరం కలుగును గాక ఆమేన్.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options