1 రాజులు 8:57-61
57
మన పూర్వికులతో ఉన్నట్లు మన దేవుడైన యెహోవా మనతో ఉండును గాక; ఆయన మనలను విడువక త్రోసివేయక ఉండును గాక.
58
ఆయన మార్గాన్ని అనుసరిస్తూ, ఆయన మన పూర్వికులకు ఇచ్చిన ఆజ్ఞలను, శాసనాలను, నియమాలను పాటించడానికి, ఆయన వైపు మన హృదయాలను త్రిప్పాలి.
59
ఆయన తన దాసుని పక్షాన, తన ఇశ్రాయేలు ప్రజల పక్షాన అనుదిన అవసరత ప్రకారం కార్యాన్ని జరిగించేలా నేను యెహోవా ఎదుట ప్రార్థన చేస్తూ మాట్లాడిన ఈ మాటలు, మన దేవుడైన యెహోవా ఎదుట రాత్రింబగళ్ళు నిలిచి ఉండాలి!
60
అప్పుడు ప్రపంచంలోని అన్ని జనాంగాలు యెహోవాయే దేవుడని, వేరెవరు లేరని తెలుసుకుంటారు.
61
మీ హృదయాలు ఇప్పుడున్నట్లుగా దేవుడైన యెహోవాకు పూర్తిగా సమర్పించుకొని, ఆయన శాసనాలు ప్రకారం జీవిస్తూ, ఆయన ఆజ్ఞలకు లోబడుతూ ఉండును గాక.”
Settings