Skip to content
1 రాజులు 8:47-54

1 రాజులు 8:47-54

47
అప్పుడు వారు బందీలుగా ఉన్న దేశంలో ఉన్నప్పుడు వారి హృదయాలు మారి పశ్చాత్తాపపడి, ‘మేము తప్పు చేసి దుర్మార్గంగా ప్రవర్తించి పాపం చేశాం’ అని వారు వేడుకుంటే,
48
తాము బందీగా ఉన్న దేశంలో వారు తమ పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో మరలా మీ వైపు తిరిగి, వారి పూర్వికులకు మీరు ఇచ్చిన దేశం వైపు, మీరు ఎన్నుకున్న పట్టణం వైపు, నేను మీ నామం కోసం కట్టిన మందిరం వైపు తిరిగి ప్రార్థన చేస్తే,
49
అప్పుడు మీ నివాసస్థలమైన పరలోకం నుండి వారి ప్రార్థన, వారి విన్నపం విని, వారి పక్షాన ఉండండి.
50
మీకు విరుద్ధంగా పాపం చేసిన మీ ప్రజలను క్షమించండి; మీకు విరుద్ధంగా వారు చేసిన తప్పులన్నిటిని క్షమించి, వారిని బందీగా తీసుకెళ్లిన వారు వీరిని కరుణించేలా చేయండి;
51
ఎందుకంటే వారు మీ ప్రజలు, మీ స్వాస్థ్యం, మీరు వారిని ఈజిప్టు నుండి ఆ ఇనుప కొలిమి మధ్యలో నుండి బయట తీసుకువచ్చారు.
52
“కాబట్టి మీ కనుదృష్టి మీ దాసుని మీద, ఇశ్రాయేలు ప్రజల విన్నపం మీద ఉండును గాక, వారు మీకు మొరపెట్టినప్పుడు మీరు విందురు గాక.
53
ఎందుకంటే ప్రభువైన యెహోవా, మీరు మా పూర్వికులను ఈజిప్టు నుండి బయటకు తీసుకువచ్చినప్పుడు మీ సేవకుడైన మోషే ద్వారా ప్రకటించినట్లుగానే, లోకంలోని జనాంగాలన్నిటి నుండి వారిని మీ సొంత వారసత్వంగా చేసుకున్నారు కదా.”
54
సొలొమోను యెహోవాకు ఈ ప్రార్థనలు, విన్నపాలు అన్ని చేసిన తర్వాత, యెహోవా బలిపీఠం ముందు మోకరించి ఆకాశం వైపు చేతులు చాచిన ఆ స్థలం నుండి లేచాడు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options