Skip to content
1 రాజులు 21:18

1 రాజులు 21:18

చుట్టుపక్కల సందర్భంతో వచనం 18 చూపబడుతోంది.
15
నాబోతును రాళ్లతో కొట్టి చంపిన సంగతి యెజెబెలు తెలుసుకొని అహాబుతో, “లేచి యెజ్రెయేలీయుడైన నాబోతు వెండికి కూడా నీకు అమ్మనని చెప్పిన ద్రాక్షతోటను నీ వశం చేసుకో! నాబోతు ఇక ప్రాణంతో లేడు, చనిపోయాడు” అని చెప్పింది.
16
నాబోతు చనిపోయాడని అహాబు వినగానే, యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్షతోటను వశం చేసుకోవడానికి అతడు లేచి వెళ్లాడు.
17
అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలీయాకు వచ్చింది:
18
“సమరయలో పరిపాలిస్తున్న ఇశ్రాయేలు రాజైన అహాబును వెళ్లి కలుసుకో. ఇప్పుడతడు నాబోతు ద్రాక్షతోటలో ఉన్నాడు, దానిని వశం చేసుకోవడానికి అతడు వెళ్లాడు.
19
అతనితో చెప్పు, ‘యెహోవా చెప్పే మాట ఇదే: నీవు ఒక మనుష్యుని హత్య చేసి అతని ఆస్తిని ఆక్రమించలేదా? యెహోవా చెప్పే మాట ఇదే: ఎక్కడైతే నాబోతు రక్తాన్ని కుక్కలు నాకాయో, ఆ స్థలంలోనే నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయి.’ ”
20
అహాబు ఏలీయాతో, “నా శత్రువా, నీవు నన్ను పట్టుకున్నావు కదా!” అన్నాడు. అందుకతడు, “నేను నిన్ను పట్టుకున్నాను, ఎందుకంటే యెహోవా దృష్టికి చెడు చేయడానికి నిన్ను నీవే అమ్ముకున్నావు అన్నాడు.
21
ఆయన, ‘నేను నీ మీదికి విపత్తును తీసుకురాబోతున్నాను. నీ సంతానాన్ని తుడిచివేస్తాను. ఇశ్రాయేలులో బానిసలు స్వతంత్రులు అని లేకుండా అహాబు వంశంలోని మగవారినందరిని నిర్మూలం చేస్తాను.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options