Skip to content
1 రాజులు 2:26-30

1 రాజులు 2:26-30

26
తర్వాత రాజు యాజకుడైన అబ్యాతారుతో, “అనాతోతులో నీ పొలాలకు తిరిగి వెళ్లు. నీవు మరణానికి పాత్రుడవు కాని నీవు నా తండ్రియైన దావీదు ముందు ప్రభువైన యెహోవా మందసాన్ని మోసి, నా తండ్రికి కలిగిన శ్రమలన్నిటిలో పాలుపంచుకున్నావు కాబట్టి నేను ఇప్పుడు నిన్ను చంపను” అన్నాడు.
27
కాబట్టి సొలొమోను అబ్యాతారును యెహోవా యాజకుని పదవి నుండి తొలగించాడు. ఇలా షిలోహులో యెహోవా ఏలీ కుటుంబీకుల గురించి చెప్పిన మాట నెరవేరింది.
28
గతంలో అబ్షాలోముతో కాకపోయినా అదోనియాతో కలిసి కుట్రపన్నిన యోవాబుకు ఈ వార్త చేరగానే అతడు యెహోవా గుడారానికి పారిపోయి బలిపీఠపు కొమ్ములను పట్టుకున్నాడు.
29
యోవాబు పారిపోయి యెహోవా గుడారంలో బలిపీఠం దగ్గర ఉన్నాడని రాజైన సొలొమోనుకు తెలిసింది. అప్పుడు సొలొమోను యెహోయాదా కుమారుడైన బెనాయాను, “వెళ్లు, అతన్ని చంపు!” అని ఆదేశించాడు.
30
కాబట్టి బెనాయా యెహోవా గుడారంలోకి ప్రవేశించి యోవాబుతో, “రాజు నిన్ను బయటికి రమ్మంటున్నాడు” అని చెప్పాడు. అయితే అతడు, “లేదు, నేను ఇక్కడే చస్తాను” అన్నాడు. బెనాయా యోవాబు తనతో చెప్పిన మాటను రాజుకు తెలియజేశాడు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options