1 రాజులు 14:7-11
7
నీవు వెళ్లి యరొబాముతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నారని చెప్పు: ‘నేను నిన్ను ప్రజల్లో నుండి లేవనెత్తి నా ప్రజలైన ఇశ్రాయేలు మీద పాలకునిగా నియమించాను.
8
దావీదు వంశం నుండి రాజ్యాన్ని తీసివేసి నీకిచ్చాను. అయితే నీవు నా సేవకుడైన దావీదులా ప్రవర్తించలేదు, అతడు నా ఆజ్ఞలను పాటిస్తూ, తన హృదయమంతటితో నన్ను అనుసరిస్తూ, నా దృష్టికి ఏవి సరియైనవో అవే చేశాడు.
9
నీవు నీకన్నా ముందు జీవించిన వారందరికంటే ఎక్కువ చెడు చేశావు. నీకోసం ఇతర దేవుళ్ళను, పోతపోసిన విగ్రహాలను చేసుకున్నావు; నాకు కోపం రేపుతూ నన్ను తృణీకరించావు.
10
“ ‘దీనిని బట్టి నేను యరొబాము వంశం మీదికి కీడు రప్పించబోతున్నాను. నేను ఇశ్రాయేలులో బానిసలు స్వతంత్రులు అని లేకుండా యరొబాము వంశంలోని మగవారినందరిని నిర్మూలం చేస్తాను. ఒకరు పెంటను కాల్చినట్లు యరొబాము వంశాన్ని పూర్తిగా దహించివేస్తాను.
11
యరొబాముకు చెందిన వారిలో పట్టణంలో చనిపోయేవారిని కుక్కలు తింటాయి, పొలంలో చనిపోయేవారిని పక్షులు తింటాయి. ఇది యెహోవా వాక్కు!’
Settings