1 దినవృత్తాంతములు 9:10-13
10
యాజకుల నుండి: యెదాయా; యెహోయారీబు; యాకీను;
11
అహీటూబు కుమారుడైన మెరాయోతుకు పుట్టిన సాదోకు కుమారుడు మెషుల్లాము పుట్టిన హిల్కీయా కుమారుడైన అజర్యా; ఇతడు దేవుని మందిరంలో ప్రముఖ అధిపతి;
12
మల్కీయా కుమారుడైన పషూరుకు పుట్టిన యెరోహాము కుమారుడు అదాయా; ఇమ్మేరు కుమారుడైన మెషిల్లేమీతుకు పుట్టిన మెషుల్లాము కుమారుడైన యహజెరాకు పుట్టిన అదీయేలు కుమారుడైన మశై;
13
తమ కుటుంబాలకు పెద్దలుగా ఉన్న యాజకుల సంఖ్య 1,760. వారు దేవుని మందిరంలో సేవలు అందించే బాధ్యత కలిగిన సమర్థులు.
Settings