Skip to content
1 దినవృత్తాంతములు 27:25-31

రాజ ఆస్తి నిర్వాహకులు

1 దినవృత్తాంతములు 27:25-31
25
రాజ్య గిడ్డంగులకు అదీయేలు కుమారుడైన అజ్మావెతు అధికారి. పల్లెప్రాంతాలలో, పట్టణాల్లో గ్రామాల్లో కోటలలో ఉన్న గిడ్డంగులకు ఉజ్జియా కుమారుడైన యోనాతాను అధికారి.
26
పొలాల్లో పని చేసేవారిమీద, భూమి దున్నే వారి మీద కెలూబు కుమారుడైన ఎజ్రీ అధికారి.
27
ద్రాక్షతోటల మీద రామతీయుడైన షిమీ అధికారి. ద్రాక్షతోటల నుండి ఉత్పత్తి అయ్యే ద్రాక్షరసాన్ని నిల్వజేసే తొట్టెల మీద షిప్మీయుడైన జబ్ది అధికారి.
28
పశ్చిమ దిగువ ప్రాంతంలో ఉన్న ఒలీవచెట్లు, మేడిచెట్ల మీద గెదేరీయుడైన బయల్-హనాను అధికారి. ఒలీవనూనె గిడ్డంగులకు యోవాషు అధికారి.
29
షారోనులో మేసే పశువులమీద షారోనీయుడైన షిట్రయి అధికారి. లోయలలోని పశువులమీద అద్లయి కుమారుడైన షాపాతు అధికారి.
30
ఒంటెల మీద ఇష్మాయేలీయుడైన ఓబీలు అధికారి. గాడిదల మీద మేరోనోతీయుడైన యెహెద్యాహు అధికారి.
31
మందల మీద హగ్రీయుడైన యాజీజు అధికారి.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options