కంటెంట్‌కు వెళ్లండి
1 దినవృత్తాంతములు 19:16-19

దావీదు పునరుద్ధరించిన సిరియా ముప్పును ఓడించుట

1 దినవృత్తాంతములు 19:16-19
16
తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోయామని గ్రహించిన అరామీయులు దూతలను పంపి, యూఫ్రటీసు నది అవతల ఉన్న అరామీయులను పిలిపించారు. హదదెజెరు సేనాధిపతియైన షోఫకు వారిని నడిపించాడు.
17
దావీదుకు ఈ సంగతి తెలిసినప్పుడు, అతడు ఇశ్రాయేలు అంతటిని సమకూర్చి యొర్దాను నది దాటి వెళ్లాడు; వారికి ఎదురుగా యుద్ధ పంక్తులు ఏర్పరిచాడు. దావీదు అరామీయులకు ఎదురుగా యుద్ధ పంక్తులు ఏర్పరిచాక వారు అతనితో యుద్ధం చేశారు.
18
అయితే అరామీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోయారు. దావీదు వారిలో 7,000 మంది రథసారధులను 40,000 సైనికులను చంపాడు. అలాగే వారి సైన్యాధిపతియైన షోఫకును కూడా చంపాడు.
19
హదదెజెరు సేవకులు తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోతున్నామని గ్రహించి దావీదుతో సమాధానపడి అతనికి లొంగిపోయారు. అప్పటినుండి ఇంకెప్పుడు అరామీయులు అమ్మోనీయులకు సహాయం చేయడానికి ఇష్టపడలేదు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options