కీర్తనలు26
Listen to this chapter
0:00
0:00
1
దావీదు కీర్తన. యెహోవా, నేను నిందారహితునిగా జీవించాను, నాకు న్యాయం తీర్చండి; నేను ఏ సందేహం లేకుండ యెహోవాను నమ్మాను.
2
యెహోవా, నన్ను పరిశీలించండి, నన్ను పరీక్షించండి, నా హృదయాన్ని నా మనస్సును పరీక్షించండి;
3
నేను నిరంతరం మీ మారని ప్రేమను జ్ఞాపకముంచుకుంటాను మీ సత్యానికి అనుగుణంగా నడుచుకుంటాను.
4
నేను మోసగాళ్ళతో కూర్చోను, వేషధారులతో నేను సహవాసం చేయను.
5
కీడుచేసేవారి గుంపు నాకు అసహ్యం దుష్టులతో నేను కూర్చోను.
6
యెహోవా, నిర్దోషినని నా చేతులు కడుక్కుని, బిగ్గరగా మీ స్తుతిని ప్రకటిస్తూ మీ అద్భుత క్రియలన్నిటిని గురించి చెబుతూ మీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం చేస్తాను.
8
యెహోవా, మీరు నివసించే ఆవరణం, మీ మహిమ నివసించే స్థలం అంటే నాకు ఇష్టము.
9
పాపులతో పాటు నా ప్రాణాన్ని నరహంతకులతో పాటు నా బ్రతుకును తుడిచివేయకండి.
10
వారి చేతుల్లో దుష్ట పన్నాగాలు ఉన్నాయి, వారి కుడి చేతులు లంచాలతో నిండి ఉన్నాయి.
11
నేను నిందారహితంగా బ్రతుకుతాను; నన్ను విమోచించండి నన్ను కరుణించండి.
12
నా పాదాలను సమతలమైన నేల మీద నిలిపాను; గొప్ప సమాజాలలో నేను యెహోవాను స్తుతిస్తాను.
Use ← → arrow keys to navigate
Settings
Reading Style
Typeface
Font Size px
Options
Study Note