కీర్తనలు120
Listen to this chapter
0:00
0:00
విడుదల కొరకు మొఱ్ఱ
1
యాత్రకీర్తన. నా బాధలో యెహోవాకు మొరపెడతాను, ఆయన నాకు జవాబిస్తారు.
2
యెహోవా, అబద్ధమాడే పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నన్ను రక్షించండి.
మోసపూరితుల గతి
3
ఓ మోసకరమైన నాలుకా, దేవుడు నీకేం చేస్తారు? ఆయన ఇంతకన్నా ఎక్కువగా నీకేం చేస్తారు?
4
వీరుల పదునైన బాణాలతో, మండుతున్న బదరీ మొక్కల నిప్పులతో ఆయన నిన్ను శిక్షిస్తారు.
శత్రుత్వుల మధ్య ప్రవాసంపై విలాపం
5
నేను మెషెకులో నివసించినందుకు, కేదారు గుడారాల మధ్యలో జీవించినందుకు నాకు శ్రమ!
6
సమాధానాన్ని ద్వేషించేవారి మధ్యలో చాలా కాలం నివసించాను.
7
నేను సమాధానం కోరుతున్నాను; కానీ వారు యుద్ధాన్ని కోరుతున్నారు.
Use ← → arrow keys to navigate
Settings
Reading Style
Typeface
Font Size px
Reading Width chars
Options
Study Note