Sherebiah గురించి బైబిల్ వచనాలు: 1. A Levite assistant to Ezra
1. A Levite assistant to Ezra గురించి వచనాలు
మా దేవుని కరుణాహస్తం మాకు తోడుగా ఉన్నందుకు, వారు ఇశ్రాయేలు కుమారుడైన లేవీకి పుట్టిన మహలి వారసుడు, సమర్థుడైన షేరేబ్యాను, అతని కుమారులు, సహోదరులతో కలిపి మొత్తం 18 మందిని తీసుకువచ్చారు;
నేను యాజకులలో నుండి ముఖ్యమైన పన్నెండుమందిని అనగా, షేరేబ్యా, హషబ్యా, వారి సోదరులలో పదిమందిని ఎంపిక చేశాను.
ప్రజలందరు నిలబడి ఉండగా లేవీయులైన యెషూవ, బానీ, షేరేబ్యా, యామీను, అక్కూబు, షబ్బెతై, హోదీయా, మయశేయా, కెలిథా, అజర్యా, యోజాబాదు, హానాను, పెలాయా మొదలగు వారందరు కలిసి ధర్మశాస్త్రాన్ని ప్రజలకు బోధించారు.
లేవీయులలో యెషూవ, బానీ, కద్మీయేలు, షెబన్యా, బున్నీ, షేరేబ్యా, బానీ, కెనానీ అనేవారు మెట్ల మీద నిలబడి తమ దేవుడైన యెహోవాకు బిగ్గరగా మొరపెట్టారు.
అప్పుడు లేవీయులైన యెషూవ, కద్మీయేలు, బానీ, హషబ్నెయా, షేరేబ్యా, హోదీయా, షెబన్యా, పెతహయా అనేవారు మెట్ల మీద నిలబడి, “లేచి నిలబడండి, మీకు నిత్యం దేవునిగా ఉన్న యెహోవాను స్తుతించండి” అని చెప్పి ఇలా స్తుతించారు: “మీ దివ్యమైన నామం స్తుతించబడుతుంది. సమస్త ఆశీర్వాదాలకు స్తుతులకు మించి హెచ్చింపబడుతుంది.