కంటెంట్‌కు వెళ్లండి

Sacred Anointing గురించి బైబిల్ వచనాలు

6 వచనాలు · 18 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. “నీవు ఈ శ్రేష్ఠమైన సుగంధద్రవ్యాలు తీసుకోవాలి: పరిశుద్ధాలయం యొక్క షెకెల్ ప్రకారం గోపరసం 500 షెకెళ్ళు, వాసనగల దాల్చిన చెక్క సగం అనగా 250 షెకెళ్ళు, పరిమళ వాసనగల నిమ్మగడ్డి నూనె 250 షెకెళ్ళు

  2. లవంగపట్ట 500 షెకెళ్ళు, అయిదు శేర్ల ఒలీవనూనె; అన్నీ పరిశుద్ధాలయం యొక్క షెకెల్ ప్రకారం తీసుకోవాలి.

  3. వాటిని పవిత్ర అభిషేక తైలంగా, పరిమళద్రవ్యాలు చేసేవాని పనిలా పరిమళ మిశ్రమం చేయాలి. అది పవిత్ర అభిషేక తైలం అవుతుంది.

  4. అహరోను నాకు యాజక సేవ చేయటానికి అతనికి పవిత్ర వస్త్రాలను ధరింపజేసి, అతన్ని అభిషేకించి ప్రతిష్ఠించాలి.

  5. అతని కుమారులను తీసుకువచ్చి వారికి చొక్కాలు తొడిగించాలి.

  6. నాకు యాజక సేవ చేయటానికి వారి తండ్రిని అభిషేకించినట్లే వారిని కూడా అభిషేకించాలి. వారి అభిషేకం యాజకత్వానికి గుర్తుగా తరతరాలకు కొనసాగుతుంది.”