Lamech గురించి బైబిల్ వచనాలు: 1. Father of Jabal, Jubal, and Tubal-Cain
1. Father of Jabal, Jubal, and Tubal-Cain గురించి వచనాలు
హనోకుకు ఈరాదు పుట్టాడు, ఈరాదు మెహూయాయేలు తండ్రి, మెహూయాయేలు మెతూషాయేలుకు తండ్రి, మెతూషాయేలు లెమెకుకు తండ్రి.
లెమెకు ఇద్దరిని భార్యలుగా చేసుకున్నాడు, ఒకరు ఆదా ఇంకొకరు సిల్లా.
ఆదా యాబాలుకు జన్మనిచ్చింది; అతడు గుడారాల్లో నివసిస్తూ పశువులను పెంచేవారికి మూలపురుషుడు.
అతని తమ్ముని పేరు యూబాలు, అతడు తంతి వాయిద్యాలు వాయించే వారికి మూలపురుషుడు.
సిల్లా కూడా ఒక కుమారునికి జన్మనిచ్చింది, అతని పేరు తూబల్-కయీను, అతడు అన్ని రకాల ఇత్తడి ఇనుప పనిముట్లు తయారుచేయడంలో నిపుణుడు. తూబల్-కయీను యొక్క సోదరి నయమా.
ఒక రోజు లెమెకు తన భార్యలతో, “ఆదా, సిల్లా నా మాట ఆలకించండి; లెమెకు భార్యలారా, నా పలుకులు వినండి. నాకు గాయం చేసినందుకు ఒక మనుష్యుని, నన్ను గాయపరిచినందుకు ఒక యువకుడిని చంపాను.
కయీనును చంపితే ఏడు రెట్లు శిక్ష పడితే, లెమెకును చంపితే డెబ్బై ఏడు రెట్లు” అని అన్నాడు.