Insects గురించి బైబిల్ వచనాలు: Clean and unclean
Clean and unclean గురించి వచనాలు
అయితే, నాలుగు కాళ్లతో నడుస్తూ నేలమీద గెంతడానికి కాళ్లకు కీళ్ళున్న ఎగిరే కీటకాలను మీరు తినవచ్చు.
వీటిలో నేత మిడత గాని చిన్న మిడత గాని ఆకు మిడత గాని ప్రతి రకమైన మిడతను తినవచ్చు.
కాని నాలుగు కాళ్లు ఉండి ఎగిరే ఇతర పురుగులన్నీ మీకు అపవిత్రమైనవి.
“ ‘వీటి ద్వార మీరు అపవిత్రులవుతారు; వాటి కళేబరాలను ఎవరైనా తాకితే వారు సాయంత్రం వరకు అపవిత్రంగా ఉంటారు.
వీటి కళేబరాలలో దేనినైన ఎవరైనా మోస్తే వారు తమ బట్టలు ఉతుక్కోవాలి, సాయంత్రం వరకు వారు అపవిత్రంగా ఉంటారు.