కంటెంట్‌కు వెళ్లండి

Fine గురించి బైబిల్ వచనాలు: A penalty

9 వచనాలు · 1 కోణం

"Fine" కోసం వెతకండి

A penalty గురించి వచనాలు

  1. “ఒకరు తమ డబ్బును గాని వస్తువులను గాని దాచమని తన పొరుగువారికి ఇచ్చినప్పుడు, ఆ వ్యక్తి ఇంట్లోనుండి అవి దొంగతనం చేయబడి ఆ దొంగ దొరికితే వాటికి రెండింతలు వాడు చెల్లించాలి.

  2. ఒకవేళ దొంగ దొరక్కపోతే ఆ ఇంటి యజమాని దేవుని ఎదుటకు హాజరు కావాలి, అప్పుడు వారు అతడు తన పొరుగువాని వస్తువులను తీశాడో లేదో తెలుసుకుంటారు.

  3. అన్యాయంగా సంపాదించిన ఎద్దు, గాడిద, గొర్రె, బట్ట వంటి వాటన్నిటి విషయంలో పోగొట్టుకున్నవాడు వాటిని చూసి, ‘ఇది నాది’ అని చెప్తే వారిద్దరు దేవుని సమక్షానికి తమ సమస్యను తీసుకురావాలి. న్యాయాధికారులు నేరస్థునిగా నిర్ధారించినవాడు ఎదుటివానికి రెట్టింపు పరిహారం చెల్లించాలి.

  4. “యెహోవాకు చెందిన పరిశుద్ధమైన వాటిలో దేని విషయంలోనైనా, ఎవరైనా అనుకోకుండ పాపం చేసి ఎవరైనా యెహోవా పట్ల నమ్మకద్రోహులైతే, వారు మంద నుండి లోపం లేని, పరిశుద్ధాలయం యొక్క షెకెల్ ప్రకారం, వెండిలో సరియైన విలువగల ఒక పొట్టేలును ప్రాయశ్చిత్తంగా తీసుకురావాలి. ఇది అపరాధపరిహారబలి.

  5. ఆ వ్యక్తి పవిత్ర పదార్థం విషయంలో తప్పిదం చేసినందుకు, అధనంగా దాని విలువలో అయిదవ వంతు నష్టపరిహారం చెల్లించి అదంతా యాజకునికి ఇవ్వాలి. యాజకుడు పొట్టేలును అపరాధపరిహారబలిగా వారికి ప్రాయశ్చిత్తం చేస్తాడు, వారు క్షమించబడతారు.

  6. లేదా వారు అబద్ధ ప్రమాణం చేసినదైనా, వారు తప్పక పూర్తి నష్టపరిహారం చెల్లించాలి, దానికి దాని వెలలో అయిదవ వంతు కలిపి వారు తమ అపరాధపరిహారబలి సమర్పించే రోజున దానినంతటిని యజమానికి ఇవ్వాలి.

  7. నిర్ణయించిన విలువ ప్రకారం వారు మందలో నుండి యెహోవాకు అపరాధపరిహారబలిగా ఒక లోపం లేని పొట్టేలును జరిమానాగా యాజకుని దగ్గరకు తీసుకురావాలి.

  8. ఆకలితో అలమటిస్తూ ఉండి ఆకలి తీర్చుకోవడానికి దొంగ దొంగతనం చేస్తే ప్రజలు వాన్ని చులకనగా చూడరు.

  9. అయినాసరే వాడు దొరికితే, వాడు ఏడంతలు చెల్లించాలి, దానికి తన ఇంటి సంపదంతా ఖర్చైనా సరే.