Booth గురించి బైబిల్ వచనాలు: Prescribed for the Israelites to dwell in, during the Feast of Tabernacles, to celebrate their wanderings in the wilderness
Prescribed for the Israelites to dwell in, during the Feast of Tabernacles, to celebrate their wanderings in the wilderness గురించి వచనాలు
మొదటి రోజున మీరు మనోహరమైన చెట్ల కొమ్మలు, తాటి మట్టలు, కాలువల ప్రక్కన ఉండే నిరవంజి చెట్ల కొమ్మలు, ఇతర నిరవంజి చెట్ల కొమ్మలను పట్టుకుని మీ దేవుడైన యెహోవా ఎదుట ఏడు రోజులు ఆనందించండి.
ప్రతి సంవత్సరం ఈ పండుగ యెహోవా కోసం ఏడు రోజులు మీరు ఆచరించాలి. ఇది రాబోయే తరాలకు నిత్య కట్టుబాటుగా ఉంటుంది; దీనిని ఏడవ నెలలో ఆచరించాలి.
ఏడు రోజులు తాత్కాలిక ఆశ్రయాలలో నివసించండి: స్థానికంగా జన్మించిన ఇశ్రాయేలీయులందరు అలాంటి ఆశ్రయాలలో నివసించాలి.
తద్వార ఇశ్రాయేలీయులను నేను ఈజిప్టు నుండి బయటకు తెచ్చిన తర్వాత వారిని తాత్కాలిక ఆశ్రయాలలో నివసింపజేశానని మీ సంతతివారు తెలుసుకుంటారు. నేను మీ దేవుడనైన యెహోవాను.’ ”
వెంటనే వారు తమ పట్టణాల్లో యెరూషలేములో ఈ విధంగా ప్రకటించారు: “మీరు పర్వత ప్రాంతానికి వెళ్లి ఒలీవ చెట్ల కొమ్మలు, అడవి ఒలీవ చెట్ల కొమ్మలు, గొంజి చెట్టు కొమ్మలు, ఈత చెట్టు కొమ్మలు, గుబురుగా ఉండే చెట్టు కొమ్మలు తీసుకువచ్చి వ్రాయబడిన విధంగా తాత్కాలిక నివాసాలు నిర్మించాలి.”
అలాగే ప్రజలందరు వెళ్లి కొమ్మలు తెచ్చి తమ ఇళ్ళ కప్పుల మీద, తమ వాకిటిలో, దేవుని ఆలయ ఆవరణంలో, నీటి గుమ్మపు వీధిలో, ఎఫ్రాయిం గుమ్మపు వీధిలో తాత్కాలిక నివాసాలు కట్టుకున్నారు.