Backsliding గురించి బైబిల్ వచనాలు: Guilt and consequences of
Guilt and consequences of గురించి వచనాలు
కాబట్టి న్యాయం మనకు దూరంగా ఉంది, నీతి మనకు అందడం లేదు. మేము వెలుగు కోసం చూస్తున్నాం కాని అంతా చీకటే ఉంది; ప్రకాశం కోసం చూస్తున్నాం కాని కటిక చీకటిలోనే నడుస్తున్నాము.
గ్రుడ్డివారిలా గోడ కోసం తడుముకుంటున్నాము, కళ్లులేని వారిలా తడుముకుంటున్నాము. సంధ్య చీకటి అన్నట్టు మధ్యాహ్నం కాలుజారి పడుతున్నాము. బలవంతుల మధ్యలో చచ్చిన వారిలా ఉన్నాము.
మేమంతా ఎలుగుబంట్లలా కేకలు వేస్తున్నాము; పావురాల్లా దుఃఖంతో మూలుగుతున్నాము. మేము న్యాయం కోసం చూస్తున్నాం కాని అది దొరకడం లేదు. రక్షణ కోసం చూస్తున్నాం కాని అది మాకు దూరంగా ఉంది.