Skip to content

Al-Taschith గురించి బైబిల్ వచనాలు

10 వచనాలు · 1 కోణం

ముఖ్య బైబిల్ వచనాలు

  1. సంగీత దర్శకునికి. “నిర్మూలం చేయకు” అనే రాగము మీద పాడదగినది. ఒక ఆసాపు కీర్తన. ఒక గీతము. దేవా, మేము మిమ్మల్ని స్తుతిస్తాము; మీ పేరు సమీపంగా ఉన్నదని మేము మిమ్మల్ని స్తుతిస్తాం; ప్రజలు మీ అద్భుతమైన కార్యాలను గురించి చెప్పుతారు.

  2. “నేను నిర్ణీత సమయంలో; న్యాయంగా తీర్పు తీరుస్తాను.

  3. భూమి దాని ప్రజలంతా భయంతో వణికినప్పుడు, దాని స్తంభాలను గట్టిగా పట్టుకున్నది నేనే. సెలా

  4. అహంకారులతో అహంకారంగా ఉండవద్దు అని దుష్టులతో, ‘మీ కొమ్ములను ఎత్తకండి.

  5. ఆకాశం వైపు మీ కొమ్ము ఎత్తకండి; అంత గర్వంగా మాట్లాడకండి’ ” అని మీరంటారు.

  6. తూర్పు నుండి కాని పడమర నుండి కాని అరణ్యం నుండి కాని ఎవరూ తమను తాము హెచ్చించుకోలేరు.

  7. దేవుడే తీర్పు తీరుస్తారు: ఆయన ఒకని తగ్గిస్తారు, మరొకని హెచ్చిస్తారు.

  8. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉంది అందులో సుగంధద్రవ్యాలు కలిపిన పొంగుతున్న ద్రాక్షరసం ఉంది; ఆయన దాన్ని బయటకు కుమ్మరిస్తారు, భూమిలోని దుష్టులందరు మడ్డితో సహా దాన్ని త్రాగివేస్తారు.

  9. నేనైతే నిత్యం ప్రకటిస్తాను; యాకోబు దేవునికి నేను స్తుతి పాడతాను.

  10. ఎందుకంటే, “దుష్టులందరి కొమ్ములను నేను విరగ్గొడతాను, కాని నీతిమంతుల కొమ్ములు హెచ్చిస్తాను” అని ఆయన అంటారు.