Achor గురించి బైబిల్ వచనాలు: A valley near Jericho.
A valley near Jericho. గురించి వచనాలు
ఆకాను మీద వారు ఒక పెద్ద రాళ్లకుప్పను వేశారు, అది ఇప్పటికీ ఉంది. అప్పుడు యెహోవా తీవ్రమైన కోపం చల్లారింది. కాబట్టి అప్పటినుండి ఆ స్థలాన్ని ఆకోరు లోయ అని పిలుస్తారు.
ఆ సరిహద్దు ఆకోరు లోయ నుండి దెబీరు వరకు వెళ్లి కొండగట్టుకు దక్షిణాన అదుమ్మీము కనుమకు ఎదురుగా ఉన్న గిల్గాలుకు ఉత్తరంగా వ్యాపించింది. అది ఎన్-షెమెషు నీళ్ల నుండి ఎన్-రోగేలు వరకు వ్యాపించింది.
నన్ను వెదకే నా ప్రజల కోసం షారోను గొర్రెలకు పచ్చికబయళ్లుగా, ఆకోరు లోయ పశువులకు విశ్రాంతి తీసుకునే చోటుగా ఉంటాయి.
అక్కడ ఆమె ద్రాక్షతోటలను ఆమెకు తిరిగి ఇస్తాను, ఆకోరు లోయను నిరీక్షణ ద్వారంగా చేస్తాను. అక్కడ ఆమె తన యవ్వన రోజుల్లో ఉన్నట్లు, ఈజిప్టు నుండి బయటకు వచ్చిన రోజున ఉన్నట్లు స్పందిస్తుంది.