Skip to content
జెఫన్యా 2:8-10

జెఫన్యా 2:8-10

8
“నా ప్రజల ప్రాంతంలోకి ప్రవేశించి వారిని దూషించిన, మోయాబు వారు చేసిన అవమానాల గురించి, అమ్మోనీయుల దూషణల గురించి నేను విన్నాను.
9
కాబట్టి, నా జీవం తోడు, మోయాబు సొదొమలా, అమ్మోను గొమొర్రాలా అవుతుంది. కలుపు మొక్కలు ఉప్పు గుంటలతో, అవి ఎప్పటికీ బంజరు భూమిగానే ఉంటాయి. నా ప్రజల్లో శేషించినవారు వారిని దోచుకుంటారు; నా దేశంలో బ్రతికినవారు తమ దేశాన్ని స్వతంత్రించుకుంటారు” అని ఇశ్రాయేలు దేవుడైన సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు.
10
ఈ విధంగా వారు గర్వంతో, సైన్యాల యెహోవా ప్రజలను అవమానించినందుకు, ఎగతాళి చేసినందుకు ప్రతిఫలం పొందుతారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options