జెకర్యా 6:1-8
1
నేను మళ్ళీ పైకి చూస్తే, నా ఎదుట రెండు పర్వతాల మధ్య నుండి నాలుగు రథాలు బయలుదేరుతూ కనిపించాయి. అవి ఇత్తడి పర్వతాలు.
2
మొదటి రథానికి ఎర్రటి గుర్రాలు, రెండవ రథానికి నల్లని గుర్రాలు,
3
మూడవ రథానికి తెల్లని గుర్రాలు, నాలుగవ రథానికి చుక్కలు ఉన్న గుర్రాలు ఉన్నాయి. అవన్నీ బలమైనవి.
4
నాతో మాట్లాడుతున్న దూతను, “నా ప్రభువా, ఇవి ఏమిటి?” అని అడిగాను.
5
దూత నాకు జవాబిస్తూ ఇలా అన్నాడు, “ఇవి సర్వలోక ప్రభువు సన్నిధి నుండి బయలుదేరిన నాలుగు పరలోకపు ఆత్మలు.
6
నల్లని గుర్రాలున్న రథం ఉత్తర దేశం వైపు, తెల్లని గుర్రాలున్న రథం పడమర వైపు, చుక్కలున్న గుర్రాలున్న రథం దక్షిణం వైపు వెళ్తాయి.”
7
ఆ బలమైన గుర్రాలు బయలుదేరి భూమి అంతా తిరగడానికి సిద్ధంగా ఉండగా అతడు, “వెళ్లి భూమి అంతా తిరగండి!” అని అన్నాడు. కాబట్టి అవి భూమి అంతటా వెళ్లాయి.
8
అప్పుడు అతడు నన్ను పిలిచి, “ఉత్తర దేశం వైపు వెళ్లేవాటిని చూడు, అవి ఉత్తర దేశంలో నా ఆత్మకు నెమ్మది కలిగిస్తాయి” అన్నాడు.
Settings