Skip to content
కీర్తనలు 99:1-9

కీర్తనలు 99:1-9

1
యెహోవా పరిపాలిస్తారు, ప్రజలు భయభక్తులతో వణికి పోతున్నారు; కెరూబులకు పైగా సింహాసనాసీనుడై దేవుడు కనిపిస్తున్నారు, భూమి కంపించాలి.
2
సీయోను పట్టణంలో యెహోవా వైభవోపేతంగా అందరికంటే పైన ఉన్నారు.
3
వారు మీ భీకరమైన గొప్ప నామాన్ని స్తుతిస్తారు, మీరు పరిశుద్ధులు.
4
రాజు నిజాయితీ కలిగి న్యాయాన్ని ప్రేమిస్తాడు కాబట్టి మీరు అతన్ని సుస్థిరంగా నిలబెడతారు; యాకోబు ప్రజల పట్ల అంటే ఇశ్రాయేలీయుల పట్ల నీతి నాయ్యాలు జరిగిస్తారు.
5
మన దేవుడైన యెహోవాను మహిమపరచండి ఆయన పాదపీఠం దగ్గర ఆరాధించండి; ఆయన పవిత్రులు.
6
దేవునికి చెందిన యాజకులలో మోషే అహరోనులు ఉన్నారు, యెహోవా నామాన ప్రార్థించే వారిలో సమూయేలు ఉన్నాడు; వారు దేవునికి ప్రార్థన చేశారు, ఆయన జవాబిచ్చారు.
7
మేఘస్తంభంలో నుండి ఆయన మాట్లాడారు. వారు ఆయన చట్టాలు పాటించారు ఆయన ఇచ్చిన శాసనాలను వారు అమలుచేశారు.
8
యెహోవా మా దేవా, మీరు వారికి జవాబిచ్చారు. మీరు వారికి క్షమించే దేవుడు, కాని వారు తప్పు చేసినప్పుడు మీరు వారిని శిక్షించారు.
9
మన దేవుడైన యెహోవాను ఘనపరచండి ఆయన పరిశుద్ధ పర్వతం దగ్గర ఆయనను ఆరాధించండి. ఎందుకంటే మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options