కీర్తనలు 88:1-5
1
ఒక గీతము. కోరహు కుమారుల కీర్తన. సంగీత దర్శకునికి. మహలతు లయన్నోత్ అనే రాగం మీద పాడదగినది. ఎజ్రాహీయుడైన హేమాను ధ్యానకీర్తన. యెహోవా, మీరు నన్ను రక్షించే దేవుడు; రాత్రింబగళ్ళు నేను మీకు మొరపెడతాను.
2
నా ప్రార్థనలు మీ ఎదుటకు వచ్చును గాక; చెవియొగ్గి నా మొర ఆలకించండి.
3
నేను ఇబ్బందుల్లో మునిగి ఉన్నాను నా ప్రాణం మరణానికి చేరువగా ఉంది.
4
సమాధికి వెళ్లే వారితో నేను లెక్కించబడ్డాను; నేను బలం లేనివాడిలా ఉన్నాను.
5
సమాధిలో పడి ఉన్న హతులైనవారిలా, నేను చచ్చినవారితో విడిచిపెట్టబడ్డాను, వారిని మీరు ఎన్నటికి జ్ఞాపకముంచుకోరు, వారు మీ సంరక్షణ నుండి తొలగిపోయారు.
Settings