Skip to content
కీర్తనలు 79:1-7

కీర్తనలు 79:1-7

1
ఆసాపు కీర్తన. ఓ దేవా, పరదేశులు స్వాస్థ్యాన్ని ఆక్రమించుకున్నారు; అవి మీ పవిత్ర మందిరాన్ని అపవిత్రం చేశారు, యెరూషలేమును పాడు దిబ్బగా చేశారు.
2
వారు మీ సేవకుల కళేబరాలను ఆకాశపక్షులకు ఆహారంగా, మీ సొంత ప్రజల మాంసాన్ని అడవి మృగాలకు ఆహారంగా వదిలేశారు.
3
వారు యెరూషలేము చుట్టూ రక్తాన్ని నీటిలా పారబోశారు, చనిపోయినవారిని పాతిపెట్టడానికి ఎవరూ లేరు.
4
మా పొరుగువారికి మేము అసహ్యులం అయ్యాం, మా చుట్టుపక్కల వారు మమ్మల్ని వెక్కిరించి హేళన చేస్తున్నారు.
5
ఎంతకాలం, యెహోవా? మీరు ఎప్పటికీ కోప్పడతారా? ఎంతకాలం మీ రోషం అగ్నిలా మండుతుంది?
6
మిమ్మల్ని గుర్తించని దేశాల మీద, మీ పేరట మొరపెట్టని, రాజ్యాల మీద, మీ ఉగ్రతను కుమ్మరించండి.
7
వారు యాకోబును మ్రింగివేశారు అతని నివాసాన్ని నాశనం చేశారు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options