Skip to content
కీర్తనలు 74:1-11

కీర్తనలు 74:1-11

1
ఆసాపు ధ్యానకీర్తన. దేవా, మమ్మల్ని శాశ్వతంగా ఎందుకు తిరస్కరించారు? మీ పచ్చికలోని గొర్రెల మీద మీ కోపం ఎందుకు రగులుకొంది?
2
మీ స్వాస్థ్య గోత్రాన్ని మీరు పూర్వం సంపాదించుకుని విమోచించిన మీ వారసత్వ సమాజాన్ని, మీరు నివసించిన సీయోను పర్వతాన్ని జ్ఞాపకం చేసుకోండి.
3
ఈ నిత్య శిధిలాల వైపు, శత్రువు పరిశుద్ధాలయం మీదికి తెచ్చిన ఈ విధ్వంసం అంతటి వైపు మీ అడుగులు తిప్పండి.
4
మీరు మాతో కలిసిన ప్రదేశంలో మీ శత్రువులు గర్జించారు; వారు తమ ధ్వజాలను సంకేతాలుగా ఏర్పరచుకున్నారు.
5
దట్టమైన పొదలను నరికే పురుషుల్లా వారు గొడ్డళ్ళు పట్టుకున్నారు.
6
చెక్కిన పలకను వారు తమ గొడ్డళ్ళతో చేతిగొడ్డళ్ళతో పగల కొట్టారు.
7
మీ పవిత్రాలయానికి నిప్పు పెట్టి నేలమట్టం చేశారు; మీ నామం కలిగియున్న నివాస స్థలాన్ని అపవిత్రం చేశారు.
8
వారు తమ హృదయాల్లో, “దేవుని ఆరాధన స్థలాలను పూర్తిగా ధ్వంసం చేద్దాం!” అనుకుని, దేశంలో దేవుడు ఆరాధించబడే ప్రతీ స్థలాన్ని తగలబెట్టారు.
9
దేవుని నుండి మాకు ఏ సంకేతాలు లేవు; ప్రవక్తలు లేరు గతించిపోయారు, ఇదంతా చివరికి ఏమవుతుందో చెప్పే వాడెవడూ మా మధ్యలేడు.
10
దేవా, ఎంతకాలం శత్రువు మిమ్మల్ని వెక్కిరిస్తాడు? శత్రువు శాశ్వతంగా మీ పేరును దూషిస్తాడా?
11
మీరు ఎందుకు మీ కుడిచేతిని వెనక్కి తీసుకున్నారు? జీవబల ప్రభావాలను ఎందుకు ఉపసంహరించుకున్నారు? పిడికిలి బిగించి, చేయి చాచి వారిని దెబ్బకొట్టు. నాశనం చేయి!

బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.