跳到主要内容
కీర్తనలు 72:16-19

కీర్తనలు 72:16-19

16
దేశం అంతటా ధాన్యం సమృద్ధిగా ఉండును గాక; కొండల పైభాగాన అది ఆడించబడును గాక. పండ్లచెట్లు లెబానోను చెట్లలా వర్ధిల్లును గాక ప్రజలు పొలం లోని పచ్చికబయళ్లుగా వృద్ధి చెందును గాక.
17
ఆయన పేరు నిరంతరం ఉండును గాక; అది సూర్యుడు ఉండే వరకు కొనసాగును గాక. అప్పుడు ఆయన ద్వారా అన్ని దేశాలు ఆశీర్వదించబడతాయి, వారు ఆయనను ధన్యుడు అని పిలుస్తారు.
18
ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దేవునికి స్తుతి, ఆయన మాత్రమే అద్భుతాలు చేస్తారు.
19
ఆయన మహిమగల నామం సదాకాలం స్తుతింపబడును గాక; భూమంతా ఆయన మహిమతో నింపబడును గాక.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options