Skip to content
కీర్తనలు 71:1-6

కీర్తనలు 71:1-6

1
యెహోవా, నేను మీలో ఆశ్రయం పొందాను; నన్ను ఎప్పటికీ సిగ్గుపడనీయకండి.
2
మీ నీతిని బట్టి నన్ను రక్షించి విడిపించండి; నా వైపు చెవి ఉంచి నన్ను రక్షించండి.
3
నేను ఎల్లప్పుడూ వెళ్లగలిగే, నా ఆశ్రయదుర్గంగా ఉండండి; మీరు నా కొండ నా కోట కాబట్టి, నన్ను రక్షించేందుకు ఆజ్ఞ ఇవ్వండి.
4
నా దేవా, దుష్టుల చేతి నుండి, చెడ్డవారు, క్రూరుల పట్టు నుండి నన్ను విడిపించండి.
5
ప్రభువైన యెహోవా, మీరే నా నిరీక్షణ, నా యవ్వనం నుండి మీరే నా ధైర్యం.
6
పుట్టినప్పటి నుండి నేను మీమీద ఆధారపడ్డాను; నన్ను తల్లి గర్భం నుండి బయటకు తెచ్చింది మీరే. నేను నిత్యం మిమ్మల్ని స్తుతిస్తాను.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options