Skip to content
కీర్తనలు 68:7-18

కీర్తనలు 68:7-18

7
దేవా! మీ ప్రజలకు ముందుగా మీరు వెళ్లారు, అరణ్యం గుండా మీరు నడిచారు. సెలా
8
సీనాయి యొక్క ఏకైక దేవుని ముందు, ఇశ్రాయేలు దేవుని ముందు, భూమి కంపించింది, ఆకాశాలు వాన కురిపించాయి.
9
దేవా, మీరు స్వచ్ఛందంగా సమృద్ధి వర్షాన్ని ఇచ్చారు; నీరసించిన మీ వారసత్వాన్ని మీరు ఉత్తేజపరచారు.
10
మీ జనులు అందులో స్థిరపడ్డారు, దేవా, మీ దయతో పేదలకు అవసరమైనవి ఇచ్చారు.
11
ప్రభువు తన మాటను చాటించారు, స్త్రీలు శుభవార్తను ప్రకటిస్తారు:
12
“శత్రు రాజులు సైన్యాలు త్వరపడి పారిపోతారు; ఇంటి పట్టున ఉన్న స్త్రీలు దోపుడుసొమ్ము పంచుకుంటారు.
13
గొర్రెల దొడ్ల మధ్యలో మీరు పడుకున్నప్పుడు కూడా, నా పావురం యొక్క రెక్కలు వెండితో, దాని ఈకలు మెరిసే బంగారంతో కప్పబడి ఉంటాయి.”
14
సర్వశక్తిమంతుడు ఈ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను కొండమీద మంచు కురిసినట్లు కనిపించింది.
15
దేవుని పర్వతమా, పర్వత శిఖరమా, బాషాను పర్వతమా, కఠినమైన పర్వతమా,
16
కఠినమైన పర్వతమా, దేవుడు పరిపాలించడానికి ఎన్నుకున్న పర్వతం వైపు ఎల్లకాలమూ యెహోవా నివసించే స్థలం వైపు ఎందుకు అసూయతో చూస్తావు?
17
దేవుని రథాలు వేలాది కొలది కోట్ల కొలదిగా ఉన్నాయి; వాటి మధ్యలో, ప్రభువు సీనాయి పర్వతం నుండి తన పరిశుద్ధాలయానికి వచ్చి ఉన్నారు.
18
యెహోవా దేవా, మీరు నిత్యం పాలించడానికి పైకి ఆరోహణమైనప్పుడు, మీరు అనేకమందిని చెరపట్టి తీసుకెళ్లారు; మీరు మనుష్యుల నుండి ఈవులు స్వీకరించారు, తిరుగుబాటుదారుల నుండి కూడా స్వీకరించారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options