Skip to content
కీర్తనలు 68:1-9

కీర్తనలు 68:1-9

1
సంగీత దర్శకునికి. దావీదు కీర్తన గీతము. దేవుడు లేచును గాక, ఆయన శత్రువులు చెదిరిపోవుదురు గాక; ఆయన విరోధులు ఆయన ఎదుట నుండి పారిపోవుదురు గాక.
2
మీరు వారిని పొగలా ఊదివేయండి; మైనం అగ్నికి కరిగి పోయినట్టు దుష్టులు దేవుని ఎదుట నశించెదరు గాక.
3
కాని నీతిమంతులు సంతోషించి దేవుని ఎదుట ఆనందించుదురు గాక వారు సంతోషంగా ఆనందంగా ఉందురు గాక.
4
దేవునికి పాడండి, ఆయన నామాన్ని బట్టి స్తుతి పాడండి, మేఘాల మీద స్వారీ చేసే ఆయనను కీర్తించండి; ఆయన పేరు యెహోవా; ఆయన ఎదుట ఆనందించండి.
5
తన పరిశుద్ధ నివాసంలో ఉన్న దేవుడు, తండ్రిలేనివారికి తండ్రి, విధవరాండ్రకు సంరక్షుడు.
6
దేవుడు ఒంటరిగా ఉన్నవారిని కుటుంబాలలో ఉంచుతారు, బందీలను విడిపించి వారికి ఆనందాన్ని అనుగ్రహిస్తారు; కాని తిరుగుబాటుదారులు ఎండిన భూమిలో నివసిస్తారు.
7
దేవా! మీ ప్రజలకు ముందుగా మీరు వెళ్లారు, అరణ్యం గుండా మీరు నడిచారు. సెలా
8
సీనాయి యొక్క ఏకైక దేవుని ముందు, ఇశ్రాయేలు దేవుని ముందు, భూమి కంపించింది, ఆకాశాలు వాన కురిపించాయి.
9
దేవా, మీరు స్వచ్ఛందంగా సమృద్ధి వర్షాన్ని ఇచ్చారు; నీరసించిన మీ వారసత్వాన్ని మీరు ఉత్తేజపరచారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options