కంటెంట్‌కు వెళ్లండి
కీర్తనలు 64:7-10

దేవుని ఆకస్మిక తీర్పు మరియు నిర్దోషిత్వ ప్రకటన

కీర్తనలు 64:7-10
7
కాని, దేవుడు తన బాణాలను వాళ్ళ మీదికి విసురుతారు; వారు అకస్మాత్తుగా కొట్టబడతారు.
8
ఆయన వారి సొంత నాలుకలను వారికే వ్యతిరేకంగా మార్చి వారిని పతనానికి తెస్తారు; వారిని చూసేవారందరూ ఎగతాళిగా తలాడిస్తారు.
9
మనుష్యులందరు భయపడతారు; దేవుడు చేసిన క్రియలను వారు ప్రకటిస్తారు ఆయన చేసిన దానిని గ్రహిస్తారు.
10
నీతిమంతులు యెహోవాయందు ఆనందించుదురు గాక. ఆయననే ఆశ్రయించెదరు గాక. యథార్థ హృదయులను ఆయన ఘనపరచుదురు గాక!
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options