Skip to content
కీర్తనలు 42:6-11

గాఢ జలముల మధ్య దేవుని జ్ఞాపకము చేసికొనుట

కీర్తనలు 42:6-11
6
నా దేవా, ఈ బరువు మోయలేక నా మనస్సు క్రుంగిపోయింది; యొర్దాను ప్రాంతం నుండి హెర్మోను పర్వత శిఖరాల నుండి మిసారు గుట్టలపై నుండి నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను.
7
మీ ప్రవాహాల గర్జనతో అగాధం అగాధాన్ని పిలుస్తుంది; మీ తరంగాలు అలలు నా మీదుగా పొర్లి పారుతున్నాయి.
8
పగటివేళ యెహోవా తన మారని ప్రేమ కుమ్మరిస్తారు, రాత్రివేళ ఆయన పాట నాకు తోడై ఉండి నా జీవదాతయైన దేవునికి ఒక ప్రార్థనగా ధ్వనిస్తుంది.
9
నా కొండ అయిన దేవునితో, “మీరు నన్నెందుకు మరచిపోయారు? శత్రువులు నన్ను అణగద్రొక్కుతుంటే శోకంతో నేనెందుకిలా వెళ్లాలి?” అని మొరపెట్టాను.
10
రోజుంతా అదే పనిగా నా విరోధులు, “మీ దేవుడెక్కడ?” అని అంటూ నన్ను గేలి చేస్తూ ఉంటే నా ఎముకలు మరణ బాధ అనుభవిస్తున్నాయి.
11
నా ప్రాణమా, ఎందుకిలా క్రుంగిపోతున్నావు? నాలో నీవెందుకిలా కంగారు పడుతున్నావు? దేవుని మీద నిరీక్షణ ఉంచు, ఆయనే నా రక్షకుడు నా దేవుడు నేను ఆయనను స్తుతిస్తూనే ఉంటాను.

బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.