1
దావీదు దేవునికి విన్నవించుకున్న కీర్తన యెహోవా, మీ కోపంలో నన్ను గద్దించకండి ఉగ్రతలో నన్ను శిక్షించకండి.
2
మీ బాణాలు నాకు గుచ్చుకున్నాయి, మీ చేయి నా మీద బరువుగా పడింది.
3
మీ ఉగ్రత వల్ల నా శరీరంలో ఆరోగ్యం లేదు; నా పాపాన్ని బట్టి నా ఎముకల్లో నెమ్మది లేదు.