Skip to content
కీర్తనలు 34:11-18

ఆశీర్వదింపబడిన జీవితం యొక్క మార్గము

కీర్తనలు 34:11-18
11
నా పిల్లలారా, రండి, నా మాట వినండి; నేను మీకు యెహోవా పట్ల భయాన్ని బోధిస్తాను.
12
మీలో ఎవరైతే జీవితాన్ని ప్రేమిస్తారో ఎవరు ఎక్కువ మంచి రోజులను చూడాలనుకుంటారో
13
మీరు చెడు పలుకకుండ మీ నాలుకను, అబద్ధాలు చెప్పకుండ తమ పెదవులను అదుపులో పెట్టుకోవాలి.
14
కీడు చేయడం మాని మేలు చేయాలి; సమాధానాన్ని వెదికి దానిని వెంటాడాలి.
15
యెహోవా కళ్లు నీతిమంతుల మీద ఉన్నాయి, ఆయన చెవులు వారి మొరను వింటాయి;
16
అయితే కీడుచేసేవారి జ్ఞాపకాన్ని భూమి మీద లేకుండా చేయడానికి యెహోవా ముఖం వారికి విరోధంగా ఉన్నది.
17
నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకిస్తారు; వారి ఇబ్బందులన్నిటి నుండి ఆయన వారిని విడిపిస్తారు.
18
విరిగిన హృదయం గలవారికి యెహోవా సమీపంగా ఉంటారు. ఆత్మలో నలిగినవారిని ఆయన రక్షిస్తారు.

బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.