Skip to content
కీర్తనలు 33:13-18

కీర్తనలు 33:13-18

13
ఆకాశం నుండి యెహోవా క్రిందకు చూస్తున్నారు ఆయన మనుష్యులందరిని కనిపెడుతున్నారు.
14
ఆయన తన నివాసస్థలం నుండి భూమిపై నివసించే వారందరినీ పరిశీలిస్తున్నారు.
15
అందరి హృదయాలను రూపించింది ఆయనే, వారు చేసే ప్రతిదీ ఆయన గమనిస్తారు.
16
ఏ రాజు తన సైనిక బలంతో రక్షించబడడు; ఏ యోధుడు తన గొప్ప శక్తితో తప్పించుకోడు.
17
విడుదల పొందడానికి గుర్రం ఉపయోగపడదు; దానికి గొప్ప బలం ఉన్నా అది ఎవరిని రక్షించలేదు.
18
కానీ యెహోవా కళ్లు ఆయనకు భయపడే వారిపైన, తన మారని ప్రేమలో ఆశ పెట్టుకున్న వారిపైన ఉన్నాయి.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options