కీర్తనలు 25:1-7
1
దావీదు కీర్తన. యెహోవా, నా దేవా, నేను మీపై నమ్మిక ఉంచాను.
2
నా దేవా, నేను మిమ్మల్ని నమ్ముతాను; నాకు అవమానం కలగనివ్వకండి, నా శత్రువులకు నాపై విజయాన్ని ఇవ్వకండి.
3
మీ కోసం ఎదురు చూసే వారెవరూ ఎన్నటికి సిగ్గుపరచబడరు; ఎన్నడూ ఆశాభంగం చెందరు, కారణం లేకుండ ద్రోహం చేసేవారి మీదకు అవమానం వస్తుంది.
4
యెహోవా, మీ మార్గాలేవో నాకు చూపండి. మీ పద్ధతులను నాకు ఉపదేశించండి.
5
మీ సత్యంలో నన్ను నడిపించి నాకు బోధించండి, మీరే నా రక్షకుడవైన నా దేవుడవు, మీ కోసమే రోజంతా నిరీక్షిస్తాను.
6
యెహోవా, మీ కరుణ, మీ మారని ప్రేమ జ్ఞాపకం చేసుకోండి, ఎందుకంటే, అవి అనాది కాలంనాటి నుండి ఉన్నాయి.
7
యవ్వనంలో నేను చేసిన పాపాలు, నా తిరుగుబాటుతనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోకండి; మీ మారని ప్రేమను బట్టి నన్ను జ్జాపకముంచుకోండి. ఎందుకంటే యెహోవా మీరు మంచివారు.
Settings