Skip to content
కీర్తనలు 146:6-10

కీర్తనలు 146:6-10

6
ఆకాశాలను, భూమిని, సముద్రాన్ని, వాటిలో ఉన్న సమస్తాన్ని సృజించినవాడు ఆయనే. ఆయన ఎప్పటికీ నమ్మదగినవాడు.
7
ఆయన అణగారిన వారికి న్యాయం చేకూరుస్తారు, ఆకలిగొనిన వారికి ఆహారం ఇస్తారు. యెహోవా చెరసాలలో ఉన్నవారిని విడిపిస్తారు,
8
యెహోవా గుడ్డివారికి చూపునిస్తారు, యెహోవా క్రుంగి ఉన్నవారిని లేవనెత్తుతారు, యెహోవా నీతిమంతులను ప్రేమిస్తారు.
9
యెహోవా పరదేశీయులను కాపాడతారు. తండ్రిలేని అనాధ పిల్లలను, విధవరాండ్రను ఆదరిస్తారు. కాని దుష్టుల ప్రణాళికలను ఆయన వ్యతిరేకిస్తారు.
10
యెహోవా శాశ్వతకాలం పరిపాలిస్తారు. సీయోను, మీ దేవుడు తరతరాలకు రాజ్యమేలుతారు. యెహోవాను స్తుతించండి.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options