కీర్తనలు 145:4-7
4
ఒక తరం వారు మరో తరానికి మీ క్రియలను కొనియాడుతూ చెపుతారు; మీ బలమైన చర్యలను గురించి చెపుతారు.
5
వారు ఘనమైన మీ మహిమ వైభవం గురించి మాట్లాడతారు, నేను మీ అద్భుత కార్యాలను ధ్యానిస్తాను.
6
వారు మీ అద్భుత కార్యాల శక్తి గురించి చెపుతారు, నేను మీ గొప్ప కార్యాలను ప్రకటిస్తాను.
7
వారు మీ సమృద్ధి మంచితనాన్ని స్తుతిస్తారు, మీ నీతి గురించి సంతోషంగా పాడతారు.
Settings