Skip to content
కీర్తనలు 132:1-10

కీర్తనలు 132:1-10

1
యాత్రకీర్తన. యెహోవా, దావీదును, అతనికి కలిగిన అన్ని బాధలను జ్ఞాపకము చేసుకోండి.
2
అతడు యెహోవాకు ప్రమాణం చేశాడు, యాకోబు యొక్క బలవంతునికి మ్రొక్కుబడి చేశాడు:
3
“యెహోవాకు నేను ఒక స్థలం కనుగొనేవరకు, యాకోబు యొక్క బలవంతునికి ఒక నివాసస్థలం చూచే వరకు, నేను నా ఇంట్లోకి ప్రవేశించను, నా మంచం మీద పడుకోను, నా కళ్ళకు నిద్ర లేదా నా కనురెప్పలకు కునుకు రానివ్వను.”
6
దాని గురించి ఎఫ్రాతాలో మేము విన్నాం, యాయరు పొలాల్లో అది మాకు దొరికింది.
7
“ఆయన నివాసస్థలానికి వెళ్దాం రండి, ఆయన పాదపీఠం ఎదుట ఆరాధిద్దాం రండి.
8
‘యెహోవా, లేవండి, మీరు, మీ బలాన్ని సూచించే నిబంధన మందసంలో, మీ విశ్రాంతి స్థలంలో ప్రవేశించండి.
9
మీ యాజకులు మీ నీతిని ధరించుకొందురు గాక; నమ్మకస్థులైన మీ ప్రజలు సంతోషగానం చేయుదురు గాక.’ ”
10
మీ సేవకుడైన దావీదు నిమిత్తం, మీ అభిషిక్తుని తిరస్కరించకండి.

బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.