కీర్తనలు 126:3-6
3
యెహోవా మన కోసం గొప్పకార్యాలు చేశారు, మనం ఆనందభరితులం అయ్యాము.
4
దక్షిణ దేశంలో ప్రవాహాలు ప్రవహించేలా, యెహోవా, మా భాగ్యాలను తిరిగి రప్పించండి.
5
కన్నీటితో విత్తేవారు సంతోషగానాలతో పంట కోస్తారు.
6
విత్తనాలను పట్టుకుని, ఏడుస్తూ విత్తడానికి వెళ్లినవారు, సంతోషగానాలతో పనలు మోసుకువస్తారు.