కంటెంట్‌కు వెళ్లండి
కీర్తనలు 119:129-136

పే: సాక్ష్యములలో ఆశ్చర్యం మరియు వెలుగు

కీర్తనలు 119:129-136
129
మీ శాసనాలు అద్భుతం; కాబట్టి నేను వాటికి లోబడతాను.
130
మీ వాక్కులు వెల్లడి అవడంతోనే వెలుగు ప్రకాశిస్తుంది. అది సామాన్యులకు గ్రహింపునిస్తుంది.
131
మీ ఆజ్ఞల కోసం ఆరాటపడుతూ, నేను నా నోరు తెరిచి రొప్పుతున్నాను.
132
మీ పేరును ఇష్టపడేవారికి మీరు ఎప్పుడూ చేసినట్టు, నా వైపు తిరిగి నాపై దయచూపండి.
133
మీ వాక్కు ప్రకారం నా అడుగుజాడలను నిర్దేశించండి; ఏ దుష్టత్వం నన్ను ఏలకుండును గాక.
134
నేను మీ కట్టడలకు లోబడేలా, మనుష్యుల దౌర్జన్యం నుండి విడిపించండి.
135
మీ సేవకుడి మీద మీ ముఖకాంతిని ప్రకాశింపనివ్వండి మీ శాసనాలను నాకు బోధించండి.
136
ప్రజలు మీ ధర్మశాస్త్రానికి లోబడకపోవడం చూసి, నా కళ్ల నుండి కన్నీరు ప్రవహిస్తుంది.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options