Skip to content
కీర్తనలు 104:1-12

కీర్తనలు 104:1-12

1
నా ప్రాణమా, యెహోవాను స్తుతించు. యెహోవా నా దేవా, మీరు చాలా గొప్పవారు; ఘనత ప్రభావాన్ని ధరించుకున్నారు.
2
యెహోవా వెలుగును వస్త్రంలా ధరిస్తారు; ఆయన ఒక గుడారంలా ఆకాశాన్ని విస్తరించి
3
తన గదుల కిరణాలను వాటి నీటిపై వేస్తారు. ఆయన మేఘాలను తన రథంగా చేసుకుని వాయు రెక్కలపై స్వారీ చేస్తారు.
4
ఆయన వాయువులను తనకు దూతలుగా, అగ్ని జ్వాలలను తనకు సేవకులుగా చేస్తారు.
5
భూమిని దాని పునాదులపై నిలిపారు; అది ఎన్నటికి కదలదు.
6
మీరు దానిని ఒక వస్త్రంలా నీటి అగాధాలతో కప్పారు; జలాలు పర్వతాలకు పైగా నిలిచాయి.
7
మీ మందలింపుతో జలాలు పారిపోయాయి, మీ ఉరుముల ధ్వనికి పలాయనం చిత్తగించాయి;
8
అవి పర్వతాలకు మీదుగా వెళ్లాయి, అవి లోయల్లోకి దిగిపోయాయి, వాటికి మీరు నిర్ణయించిన చోటుకు అవి చేరుకున్నాయి.
9
అవి దాటలేని సరిహద్దును మీరు ఏర్పరిచారు; అవి ఎన్నటికి భూమిని ముంచివేయవు.
10
ఆయన ఊటలను కనుమలలోకి నీటిని కుమ్మరింపజేస్తారు; అవి పర్వతాల మధ్య ప్రవహిస్తున్నాయి.
11
అవి పొలాలలోని అడవి మృగాలకు నీరు అందిస్తాయి; అడవి గాడిదలు తమ దాహం తీర్చుకుంటాయి.
12
ఆ జలాల ప్రక్కన ఆకాశపక్షులు గూడు కట్టుకుంటాయి; కొమ్మల మధ్య అవి పాడతాయి.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options