సామెతలు 7:21-27
21
ఆ యువకుని వశపరచుకోవడానికి ఆ వేశ్య శతవిధాల ప్రయత్నించింది; దాని మృదువైన మాటలు అతన్ని మాయ చేశాయి.
22
అతడు మూర్ఖునిలా ఒక్కసారిగా వధకు వెళ్లే ఎద్దులా, ఉచ్చులోకి దిగిన జింకలా దాని వెంటపడ్డాడు,
23
తన ప్రాణానికి అపాయం ఉందని తెలియక, ఉరి దగ్గరకు పక్షి త్వరపడునట్లు, వాని గుండెను బాణంతో చీల్చే వరకు వాడు దాని వెంట వెళ్లాడు.
24
కాబట్టి ఇప్పుడు నా కుమారుడా, చెవియొగ్గి; నా మాటలు విను.
25
వేశ్య మార్గాల తట్టు నీ హృదయాన్ని వెళ్లనీయకు దారి తప్పి అది వెళ్లే దారిలో వెళ్లకు.
26
అది గాయపరచి చంపినవారు లెక్కలేనంత మంది; అది పడద్రోసిన వారు అనేకులు.
27
దాని ఇల్లు సమాధికే దారి తీస్తుంది, దాని తిన్నగా మరణానికే మార్గాన్ని చూపిస్తుంది.
Settings