Skip to content
సామెతలు 7:1-8

సామెతలు 7:1-8

1
నా కుమారుడా, నా మాటలు పాటించు, నా ఆజ్ఞలను నీలో భద్రపరచుకో.
2
నా ఆజ్ఞలు నీవు పాటిస్తే నీవు బ్రతుకుతావు; నా బోధనలను నీ కనుపాపలా కాపాడు.
3
నీ వ్రేళ్ళకు వాటిని కట్టుకో; నీ హృదయ పలక మీద వ్రాసుకో.
4
జ్ఞానంతో, “నీవు నా సోదరివి” అంతరార్థంతో, “నీవు నాకు బంధువువనియు చెప్పు.”
5
అవి నిన్ను వ్యభిచారిణి నుండి కాపాడతాయి, దారితప్పిన స్త్రీ యొక్క మోహపు మాటల నుండి నిన్ను కాపాడతాయి.
6
నేను నా ఇంటి కిటికీ దగ్గర జాలి గుండా బయటకు చూశాను.
7
బుద్ధిహీనుల మధ్య, యువకుల మధ్య, వివేచనలేని ఒక యువకుని నేను చూశాను.
8
అతడు వ్యభిచారి మూలన ఉండే సందు దగ్గరకు వెళ్తున్నాడు, దాని ఇంటి వైపే నడుస్తున్నాడు

బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.

Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options